హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు ప్రభుత్వ శుభవార్త..!

కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లభించిందని, పాలసీని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 20 వేల మంది అక్రిడిటెడ్‌ జర్నలిస్టులకు ప్రయోజనం కలగనుంది.