హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నెల్లూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు నగరంలోని మహాత్మా గాంధీ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల నేపథ్యంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కేవీఆర్ పెట్రోల్ బంక్, బట్వాడి పాలెం, డీకే డబ్ల్యూ కళాశాల, నీలగిరి సంఘం తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.