హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు 2.87 లక్షల మందికి పింఛన్లు పంపిణీ

నెల్లూరు: జిల్లాలో మంగళవారం సామాజిక పింఛన్లు నగదు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,87,970 మంది లబ్ధిదారులకు దాదాపుగా 126 కోట్లు నగదు పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు నగదును పంపిణీ చేస్తారు.