AKP: అడ్డసారంలో మంగళవారం గిరిజనులకు జీడి తోటల సంరక్షణపై ఉద్యాన అధికారి షర్మిల అవగాహణ కల్పించారు. వర్షాకాలంలో ఎండు, చీడ కొమ్మలను కత్తిరించి తోటలను శుభ్రం చేసుకోవాలన్నారు. పాదులు తీసి యూరియా, ఎస్ఎస్పీ, పొటాష్ ఎరువులు తగిన మోతాదులో అందించాలని తెలిపారు. దీనివల్ల నాణ్యమైన పిక్కలతో అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. అడ్డసారం, దిబ్బలపాలెం రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులతో అధిక లాభాలు


