హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యూఆర్ కోడ్ విధానం రద్దు చేయాలి.. రేషన్ డీలర్ల వినతి

తూ.గో: క్యూఆర్ కోడ్ విధానం వల్ల రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జామి కృష్ణ తెలిపారు. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సోమవారం బొమ్మూరులోని కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. డీలర్ల కమిషన్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సాంకేతిక విధానాల అమలులో డీలర్లపై ఒత్తిడి లేకుండా చూడాలన్నారు.