హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలేపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

సత్యసాయి: బాలేపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మూర్తితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడం ఆనందంగా ఉందని, బాలేపల్లి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.