హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

BPT: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని యద్దనపూడి ఎస్సై రత్నకుమారి సూచించారు. మండల పరిధిలోని చింతపల్లిపాడు గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో అపరిచిత, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.