కాకినాడ: పాయకరావుపేటలో సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తుని ఆర్టీసీ డిపో పరిధిలోని పలు సాధారణ బస్సు సర్వీసులను ఆ రోజు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ఎస్. శరత్ బాబు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. సెప్టెంబర్ 3 నుంచి అన్ని బస్సు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 2న పలు బస్సు సర్వీసులు తాత్కాలిక రద్దు


