సత్యసాయి: చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించినట్లు హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ తెలిపారు. తనిఖీల్లో సడ్లపల్లికి చెందిన ప్రసాద్ గోరంట్లకు చెందిన మహేశ్ బాబు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జరిమానా


