కోనసీమ: వెలిగొండ ప్రాజెక్టుపై CM చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతూ అబద్ధ ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ ఆరోపించారు. సోమవారం సఖినేటిపల్లిలో ఆయన మాట్లాడుతూ.. 1996లో శంకుస్థాపన చేసి, 30ఏళ్ల తర్వాత తానే ప్రారంభించానని CM చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కేవలం 6.686 కి.మీ. తవ్వి ప్రాజెక్టు క్రెడిట్ అంతా తనదేనని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండపై చంద్రబాబు ప్రచారం అవాస్తవం: శివకుమార్


