హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ: ఎమ్మెల్యే శ్రావణి

ATP: సింగనమల క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిశారు. పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని శ్రావణి హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.