హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగాలపల్లిలో 'పల్లె నిద్ర' కార్యక్రమం

KDP: సిద్దవటం మండలం జంగాలపల్లి గ్రామంలో పోలీసులు పల్లె నిద్ర నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్సై హారిక ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వినాయక చవితిని ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు.