సత్యసాయి: కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం ఆర్డీటీ ఆధ్వర్యంలో మహిళా క్రికెటర్ల ఎంపికలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఎంపికల్లో అండర్-15, అండర్-18 విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రతిభను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఈ ఎంపికలకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు మైదానానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో మహిళా క్రికెటర్ల ఎంపిక


