SKLM: ఆమదాలవలస మండలంలోని బొబ్బిలిపేట గ్రామంలో డీఎస్పీ వివేకానంద్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని సోమవారం రాత్రి చేపట్టారు. గ్రామంలో నేరాలు, సమస్యలపై ప్రజలతో మాట్లాడి అవగాహణ కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే 100 లేదా 112కు ఫోన్ చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బొబ్బిలిపేటలో పల్లె నిద్ర


