సిక్కింలోని మంగన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైంది. ఉదయం 1:48 గంటలకు భూమి కంపించగా.. 7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
వార్తలు
సిక్కింలో భూకంపం.. 3.9 తీవ్రత


