VSP: మద్దిలపాలెం పట్టణం హెచ్‌బీ కాలనీ 11కేవీ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. సింహాద్రిపురం, డాక్టర్స్ కాలనీ, స్టీల్స్ ప్లాంట్ క్వార్టర్స్, హెచ్‌బీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోతుందని పేర్కొన్నారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


