హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: నరసన్న‌పేట మండలం ఉర్లాం విద్యుత్ ఉప కేంద్రంలోని చోడవరం 11కేవీ ఫీడర్‌లో నిర్వహణ పనుల నిమిత్తం మంగళవారం సరఫరా నిలిపివేస్తున్నామని ఈఈ నర్సింహకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని ఆయన కోరారు.