హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్జి ఇంటి ప్రాంగణంలో ఉడుము ప్రత్యక్షం

ప్రకాశం: గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర ఇంటి ప్రాంగణంలో సోమవారం ఉడుము ప్రత్యక్షమైంది. ఉడుమును చూసిన జడ్జి పెంపుడు కుక్కలు గట్టిగా అరవడంతో అక్కడ ఉడుము ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు ఉడుమును సురక్షితంగా బంధించి నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.