హైదరాబాద్: 28°C
వార్తలు

దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27) తొలి త్రైమాసికంలో(APR-JUN) భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 6.9 శాతంగా ఉంది. వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చన్న RBI అంచనాలను మించి భారత ఆర్థిక వ్యవస్థ అదరగొట్టింది. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు జీడీపీ వృద్ధికి ప్రధాన కారణమని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ(MoSPI) వెల్లడించింది.