హైదరాబాద్: 28°C
వార్తలు

16 PSUల పనితీరుపై రేపు రాజ్‌నాథ్ సమీక్ష

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల(DPSU) పనితీరుపై వార్షిక సమీక్ష నిర్వహించనున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, రక్షణ ఎగుమతుల పెంపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా HAL, BEL, BDL, మిధాని సహా 7 సంస్థల సీఎండీలు 2025-26 FYకి సంబంధించిన డివిడెండ్ చెక్కులను కేంద్రమంత్రికి అందజేయనున్నారు.