హిమాచల్‌ప్రదేశ్ కులు జిల్లాలోని నిరమండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భాగిపుల్-జావో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 200 మీటర్ల మేర రోడ్డు ధ్వంసమైంది. యంత్రాంగం వెంటనే స్పందించి రహదారి పునరుద్ధరణ చర్యలను ముమ్మరంగా చేపట్టింది. వర్షం లేకపోయినా హఠాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
వార్తలు
విరిగిపడ్డ కొండచరియలు.. నిలిచిన రాకపోకలు


