హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డులో ఫీవర్ సర్వే

కృష్ణా: పెడన 8వ వార్డులో సోమవారం ఫీవర్ సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతోపాటు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ సూరిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.