ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ అయ్యారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్ జలసంధి మూసివేత, US ఆంక్షలతో వాణిజ్యానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కాగా, తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే దురాక్రమణదారులకు మాత్రం దీటుగా బదులిస్తామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
వార్తలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. మోదీ భేటీ ప్రాధాన్యం


