హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరానికి ఎలక్ట్రికల్ వాహనాల అందజేత

సత్యసాయి: పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ద్వారా ధర్మవరం మున్సిపాలిటీకి రెండు చెత్త తరలించే ఎలక్ట్రికల్ వాహనాలను టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ అందజేశారు. పట్టణంలోని నేసేపేట పుట్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌కు వీటిని అందించారు. ధర్మవరంలో పరిశుభ్రతే తన లక్ష్యమని పరిటాల శ్రీరామ్ తెలిపారు.