హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇళ్లను గ్రౌండింగ్‌ చేయాలి'

ASR: పీఎం-జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 28,691 ఇళ్లు మంజూరు కాగా, 25,388 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని 3,303 ఇళ్లపై దృష్టి సారించి, లబ్ధిదారుని క్షేత్రస్థాయిలో సంప్రదించి నిర్మాణం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.