హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ 70 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విని, వీలైనంత త్వరగా పరిష్కరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.