హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

ELR: ముసునూరు గ్రామంలోని మండల తహసీల్దారు కార్యాలయం వద్ద సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, బహుజనుల జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఉపాధి హామీ పాత విధానం అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.