హైదరాబాద్: 28°C
వార్తలు

స్వదేశీ చిప్ తయారీకి భారీ ఊతం

దేశంలో కంప్యూటర్‌ చిప్‌ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భారీ అంచనాలతో రూపొందించిన 'సెమీకాన్‌ 2.0' స్కీమ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విలువ ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు. దీనిద్వారా దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తికి భారీగా ప్రోత్సాహం లభించనుంది.