NRML: సంచార, విముక్త తెగల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సంచార జాతుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సంచార తెగల అభ్యున్నతికి కృషి చేయాలి'


