హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ. 43 కోట్లతో అభివృద్ధి పనులు: ఎంపీ

GDWL: గద్వాల రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రూ.43 కోట్లతో స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలకు దీటుగా ప్రధాని  మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు.