హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల అధిక ధరలపై రైతుల ఆందోళన

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో DAP, 20-20 తదితర ఎరువులను నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సన్న, చిన్నకారు రైతులు అదనపు భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలపై వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.