హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు

SRD: కంగ్టి మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. MPDO దయాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సుమారు 24 శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజావాణి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి నాలుగు దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.