BDK: మణుగూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ అద్దంకి నరేష్, ఎంపీవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
మణుగూరులో ప్రజావాణి కార్యక్రమానికి స్పందన


