CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే అమ్మవారి మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, విభూది, అడ్డనామాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శివరూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
శివరూపంలో దర్శనమిచ్చిన విరూపాక్షి మారెమ్మ


