హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

NRPT: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం అందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. స్వీకరించిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులకు పంపి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.