WGL: సెలవు ముగియడంతో నర్సంపేట బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. వరంగల్, హైదరాబాద్ వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలివచ్చారు. సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు అధికారులను కోరారు.
తెలంగాణ
నర్సంపేట బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ


