హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగారాం బస్టాండులో నడుచుకుంటూ వెళ్తుండగా కోరుట్ల నుంచి వేములవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయన కాలుపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో గంగారాం తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.