హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో రామయ్య నిత్య కల్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిత్య కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అర్చకులు స్వామివారి కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.