అల్లూరి: ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. సోమవారం పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎం గోదామును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పర్యవేక్షణ, సిబ్బంది విధులను పరిశీలించారు. గోదాము వద్ద 24 గంటలూ భద్రతా నిఘా కొనసాగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎంల భద్రతలో నిర్లక్ష్యానికి తావులేదు: జేసీ


