హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్

HNK: జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. సోమవారం భూములు, కొలతల శాఖ కార్యాలయంలో 70 గ్రామాల రీ సర్వే వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసే ప్రక్రియను ఆమె పరిశీలించారు. పాలిగన్ మ్యాప్‌లు, ల్యాండ్ పార్సల్ మ్యాప్‌ల తయారీపై వివరాలు తెలుసుకున్నారు.