హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా చండీశ్వరి దేవి

ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె. చండీశ్వరి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో యాదాద్రి భువనగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె పదోన్నతిపై ములుగుకు బదిలీ అయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడం, ప్రజల్లో న్యాయ అవగాహన పెంచడం, లోక్‌అదాలత్‌లను సమర్థవంతంగా నిర్వహించడం ప్రాధాన్యతలని తెలిపారు.