BHNG: వంగపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పర్మినెంట్ బస్‌స్టాప్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్‌స్టాప్ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజలు, ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
వంగపల్లిలో పర్మినెంట్ బస్‌స్టాప్ ప్రారంభం


