హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ ప్రజల నీటి దాహాన్ని తీర్చిన MS రాజు

సత్యసాయి: మడకశిర మండలంలోని కల్లుమర్రి పంచాయతీ ఎల్లోటి గ్రామంలో కొత్త బోరుకు మోటార్ పంపు వేసి నీటి సమస్యను తీర్చినందుకు ఎమ్మెల్యే MS రాజు, గుండుమల తిప్పేస్వామికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటి సరఫరాను మండల పార్టీ అధ్యక్షుడు కల్లుమర్రి నాగరాజు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బద్రి పాల్గొన్నారు.