SRPT: కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద CI అభిమానినంటూ ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. 'ఓ అధికారిగా ఉండటం వేరు.. ఓ అధికారి పేరు మీద నమ్మకం ఉండటం వేరు' అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. డబ్బా కొట్టు తొలగింపు విషయంలో సీఐ అనుచితంగా ప్రవర్తించారంటూ BRS ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు కావడం పట్టణంలో చర్చకు దారితీసింది.
తెలంగాణ
సీఐకి మద్దతుగా ఫ్లెక్సీ చర్చనీయాంశం!


