హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్‌ఐవీపై అవగాహన వాహనం ప్రారంభం

PLD: నరసరావుపేటలో సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అవగాహన వాహనాన్ని ప్రారంభించారు. ప్రజల్లో హెచ్‌ఐవీపై అపోహలు తొలగించి, వ్యాధి నివారణ పరీక్షలు, చికిత్సపై అవగాహన కల్పించేందుకు వాహనం ద్వారా ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.