హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండలంలో 164 పోలింగ్ కేంద్రాలు: ఎంపీడీవో

NDL: సంజామల మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలో 164 వార్డులకు గాను 164 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ఎంపీడీవో ఐ. సాల్మన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఎంపీడీవో, తహశీల్దార్, సొసైటీ కార్యాలయాల్లో ప్రచురించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో సురేశ్ ఉన్నారు.