హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాలోజీ హెల్త్ యూనివర్సిటీ మార్గంలో గుంతల బెడద..!

HNK: హన్మకొండలోని కాలోజీ హెల్త్ యూనివర్సిటీ నుండి ఆటోనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ప్రవేశం వద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అధికారులు తక్షణమే గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.