హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లెక్సీ రగడ.. మంత్రి కొండా పేరు లేకపోవడంపై చర్చ

MHBD: కేసముద్రం పట్టణంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం చర్చనీయాంశమైంది. సోమవారం అధికారిక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడంతో పాటు శంకుస్థాపన ఫలకాలపై కూడా ఆమె పేరు కనిపించకపోవడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సీట్లపై సైతం మంత్రి పేరు లేకపోవడం స్థానికంగా ఆసక్తిని రేపింది. వివాదం నేపథ్యంలో తాజా ఘటన ఆసక్తికరంగా మారింది.