హైదరాబాద్: 28°C
వార్తలు

రైలు ఢీ కొని ముగ్గురు మృతి

బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లాపుర రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం చేసుకుంది. ట్రాక్ దాటుతున్న ఇద్దరు బాలికలు సహా ఓ మహిళను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో హిందూపురానికి  చెందిన ఇర్ఫాన, రుకియా, రాకియాలు మృతి చెందారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వీరంతా దొడ్డబళ్లాపురలోని బంధువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.