జమ్మూకశ్మీర్ చీనాబ్ నదికి వరద పోటెత్తింది. దీంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రియాసి జిల్లాలోని సలాల్ డ్యామ్ గేట్లు తెరిచి నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వార్తలు
తెరుచుకున్న సలాల్ డ్యామ్ గేట్లు


